గులాబీ భరోసాతో కార్యకర్తకు కొండంత అండ

Published: Tuesday February 16, 2021
 ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా సౌకర్యం
 వికారాబాద్ నియోజకవర్గం సభ్యత్వ లక్ష్యం 50 వేలు
 గులాబీ భరోసా కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 15 ( ప్రజాపాలన ) : టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ప్రతి కార్యకర్తకు ఆర్థిక భద్రత ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం మోమిన్‌పేట్‌ మండలానికి చెందిన దుర్గంచెరువు, వెల్చాల్, రాంనాథ్గుడుపల్లి, మల్ రెడ్డి గూడ, గోవిందపూర్ గ్రామాలలో పార్టీ మండల అధ్యక్షుడు చీమల్దరి సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం, జెండా ఆవిష్కరణ " గులాబీ భరోసా " అనే కార్యక్రంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రెండేళ్ళకు ఒకసారి వచ్చే పార్టీ సభ్యత్వ పండుగలో ప్రతి ఒక్కరూ విధిగా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా సౌకర్యం కలదు అని గుర్తు చేశారు. అనుకోని సంఘటన జరిగి కార్యకర్త చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఆర్థిక సహకారం అందుతుందని పేర్కొన్నారు. పట్ట భద్రుల ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున మీ సమస్యలను పరిష్కరించడానికి ఏ అధికారి రాడు అని వివరించారు. గత నెల రోజుల క్రితం నుండి గ్రామ సమస్యలు పరిష్కరించడానికి " మీతో నేను " అనే కార్యక్రమంతో ప్రతి గ్రామానికి వస్తున్నానని చెప్పారు. ఎన్నికలు పూర్తి అయిన తరువాత మళ్ళీ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామానికి వస్తానని విశ్వాసం వ్యక్తపరిచారు. అప్పటి వరకు మీ సమస్యలను కాకుండా సభ్యత్వాన్ని పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ సభ్యత్వం 60 లక్షల పై చిలుకు ఉందని తెలిపారు. టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాసన్ పల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ శ్రేయస్సు కొరకు మనమందరం సభ్యత్వాన్ని చేద్దామని పిలుపునిచ్చారు. మనక అప్పగించిన లక్ష్యాన్ని అన్ని మండలాల కంటే ఎక్కువ సభ్యత్వాన్ని చేసి ఆదర్శంగా నిలుద్దామని వివరించారు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ ఉండదని కార్యకర్తలను చైతన్యం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ బి.విజయ్ కుమార్, దుర్గంచెరువు సర్పంచ్ హరిశంకర్, రాంనాథ్ గుడుపల్లి సర్పంచ్ జగదీశ్వర్, టిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, షఫీ, సుభాన్ రెడ్డి, గ్రామాల సర్పంచులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. 
Attachments area