ఘనంగా విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

Published: Tuesday December 14, 2021

వెల్గటూర్, డిసెంబర్ 13 (ప్రజా పాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండల కేంద్రము కోటిలింగాల కమాన్ వద్ద నటుడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోమవారం రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జగిత్యాల్ భువన బ్లడ్ బ్యాంక్ చెందిన పాండురంగ విఠల్, టెక్నీషియన్ రమణ, మాజీద్, వెంకటేష్, వారు విక్టరీ వెంకటేష్ అభిమానులు, యువకులను నుండి రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్, ఉపసర్పంచ్ గుండేటి సందీప్ రెడ్డి, మాజీ సర్పంచ్ గాజుల సతీష్, వీరాభిమాని మాదాసు మారుతి, తె.రా.స నాయకులు రాందేవ్ కోటయ్య, కస్తూరి వినోద్, తాటి నాగరాజు గాజుల సుమన్, ఎనగందుల చందు, గాజుల శ్రీనివాస్, ఉప్పులేటి శ్రీనివాస్ పుట్టపాక తిరుపతి, బండమీది రమేష్, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ శిబిరంలో 15 మంది రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి నిర్వాహకులు పండ్లు, త్రాగునీరు, పోషక ఆహార  పదార్థాలు అందించారు. నిర్వాహకులను పలువురు అభినందించారు