యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలప్రతి ఒక్కరు ఎయిడ్స్

Published: Tuesday February 07, 2023
గురించి తెలుసుకోవాలి లంక కొండయ్య మధిర ఫిబ్రవరి 6 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఎయిడ్స్ గురించి తెలుసుకోవాలని లంక కొండయ్య పేర్కొన్నారు  స్థానిక మధిర టౌన్ లో టీవీఎం హైస్కూల్ గ్రౌండ్ లో రోజువారి మార్నింగ్ వాక్ లో భాగంగా ప్రముఖ సామజిక సేవకులు మధిర ఆశామిత్ర లంకా కొండయ్య ప్రత్యేక హెచ్ఐవిఎయిడ్స్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా రోజు వారి రాష్ట్రీయ స్వయం సేవక్ బృందం నిర్వహకులు రాజేస్వరశర్మ ఆధ్వర్యంలో యువతకు దేశ సేవా సామాజిక సేవా అదేవిధంగా యోగా ఎక్సర్ సైజ్ వ్యక్తి గత నైపుణ్య కార్యక్రమం చేపడుతున్న యూత్ బృందం నాకు హెచ్ఐవి ఎయిడ్స్ పై కరపత్రికలు పంచి చిత్ర పటాలు ద్వారా సంపూర్ణ ము గా అవగాహన పరచి ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి యువత తాను తెలుసుకొని ఇతరులకు నా వంతుగా అవగాహన పరుస్తాను అని
ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంనకు హాజరు ఐన ప్రముఖ సీనియర్ ఉపాధ్యాయులు వ్యక్తి త్వ వికాస నిపుణులు శ్రీ గండూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి యూవత ఎయిడ్స్ గురించి తెలుసుకొని పలు సామాజిక రుగ్మతలకు దూరం గా ఉండాలి అని జన సమూహ ములో అవకాశం దొరికి నప్పుడల్లా హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రత్యేక అవగాహన చేయటం ఎయిడ్స్ రహిత సమాజం కోసం అహర్నిశలు కృషి చేయటం అభినందనీయo అని అన్నారు. ఈ కార్యక్రమంలో మరో సీనియర్ ఉపాధ్యాయులు కొండపల్లి నారాయణ దాసు తో పాటు వివధ కళాశాలలో చదివే విద్యార్థులు స్వయం సేవక్ సభ్యులు పాల్గొన్నారు.