తెలంగాణలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా? కెసిఆర్ వై ఎస్ ఆర్ షర్మిల పార్టీ నాయకుల ప్రశ్న

Published: Wednesday November 30, 2022
బెల్లంపల్లి నవంబర్ 29  ప్రజా పాలన ప్రతినిధి: పనులు జరుగలేదంటూ ప్రశ్నిస్తే  వాహనాలను తగలబెట్టి, దాడులు చేస్తారా, ఇది దేనికి సంకేతం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? అంటూ వైఎస్సార్ షర్మిల పార్టీ నాయకులు  ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు .
సోమవారం స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,
మహా ప్రస్థానం పాద యాత్రలో భాగంగా   వై ఎస్ శర్మిల రెడ్డి నర్సంపేట నియోజక వర్గంలో 
ప్రజల బాగోగులు అడిగి తెలుకుని,  తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆక్రమాలు, అరాచకాలను, శర్మిల తెరాస పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగినందుకు,  ప్రభుత్వం  అవమానాన్ని భరించలేక ఏమి చేయాలో పాలుపోక, నాయకురాలు శర్మిలను అరెస్టు చేసి టిఆర్ఎస్ పార్టీ క వ్యక్తులు రౌడీల్లా, గుండాల్లా ప్రవర్తించి  దాడులకు పాల్పడి, బస్సులను దగ్ధం చేసి పాదయాత్ర అడ్డుకోవడం చూస్తే ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా అని ప్రశ్నించక్క తప్పడం లేదని అన్నారు.
ప్రజలకోసం ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు చెయిస్తే , ఇలాంటి దాడులు చేసినందుకు, ప్రజలు , పార్టీ చూస్తు ఉరుకోదని, ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ  కోఆర్డినేటర్ చిలుక సంతోష్, దార కుమార స్వామి, ఎం డి స్వర్వర్, సాయికిరణ్ ,దర్మపురి శ్రీనాద్, తదితరులు పాల్గొన్నారు.