రాజ్యాధికారమే బీసీల అంతిమ లక్ష్యం

Published: Tuesday December 27, 2022

జన్నారం, డిసెంబర్26, ప్రజాపాలన: బిసిలకు రాజ్యాధికారం సాధించడం బీసీ ఉద్యమ అంతిమ లక్ష్యమని బీసీ కులాల ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీసీ ఉద్యమ సంక్షేమ సంఘం కో కన్వీనర్ కే ఏ నరసింహులు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీలో కులాల వారీగా జనాభా లెక్కల వివరాలు లేకపోవడం వలన రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. జనాభా గణనలో బీసీ కుల గణన చేపట్టాలని అన్నారు. పంచాయతీ రాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుంచి 52 శాతానికి పెంచాలన్నారు. బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించేందుకు బీసీ యాక్ట్ ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ బీసీల రిజర్వేషన్లు 27 శాతం నుంచి 56శాతానికి పెంచాలన్నారు. కేంద్రస్థాయి బడ్జెట్ తో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న  16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. బీసీలకు సామాజిక రక్షణ భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్ తీసుకురావాలన్నారు. తదుపరి ఝురాసంగంలో బీసీ బాలురా ,కేజీబీవి ,ఆదర్శ , మహాత్మా జ్యోతిరావు పూలే ఓయ్ విద్యాలయాలను బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకు వస్తామని రాజు తెలియజేశారు. కేంద్రస్థాయి లో రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బీసీ సంఘాల సంక్షేమ సంఘం  కోడూరు చంద్రయ్య, కొంతం శంకరయ్య, కాసెట్టి లక్ష్మణ్, గంగయ్య, నరసయ్య, మూల భాస్కర్ గౌడ్, దండవేణి చంద్రమౌళి, శిరవేణి పెద్దిరాజం, శ్రీరాముల గంగాధర్, మామిడి విజయ్, ముదెళ్ల శంకర్, బురగడ్డ జగన్, సిరవేణి కిషన్, తదితరులు పాల్గొన్నారు.