ముత్తూట్ ఫిన్ కార్ఫు నుండి నోటీసు లేకుండా బంగారం ఎలా వేలం వేస్తారు?

Published: Tuesday July 12, 2022

ముత్తూట్ ఫిన్ కార్ప్ బాధితుడు కంబాలపల్లి కృష్ణ
ఇబ్రహీంపట్నంలో పేద ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని కొన్ని వ్యాపార సంస్థలు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి కృష్ణ అనే వ్యక్తి తన సొంత అవసరాల కోసం తులంన్నర (1.5) బంగారాన్ని ఇబ్రహీంపట్నంలో గల ముత్తూట్ ఫిన్ కార్ప్ సంస్థలో తాకట్టు25/9/ 2021లో తాకట్టు పెట్టడం జరిగింది. బాధితులైన నాకు ముత్తూట్ ఫిన్ కార్ప్ నుంచి ప్రతి సమాచారం చేరవేయవలసిన అవసరం ముత్తూట్ ఫిన్ కార్ప్ అధికారులకు ఉంది. నా యొక్క 1.5 అనగా తులంన్నర బంగారాన్ని వేలం వేసిన సంగతి నాకు తెలిసింది. అదేమని సంస్థకు వెళ్లి అడగగా మీకు నోటీసులు పంపించాము మీరు స్పందించగపోగా  బంగారాన్ని వేలం వేశామని మీకు మూడు వేలు మాత్రమే వస్తాయని చెప్పడం జరిగింది. ఇదేమని మేనేజర్ రాజు (అలియాస్ గణేష్)ను  అడగగా మేము మా సంస్థ నుంచి కంబాలపల్లి కృష్ణ కు డిసెంబర్లో బంగారం వేలం వేస్తున్నామని  పోస్ట్ ఆఫీస్ ద్వారా నోటీసులు పంపించామని మా దగ్గర రిసీవ్డ్ కాపీలు ఉన్నాయని మేనేజర్ రాజు  చెబుతున్నారు. కంబాలపల్లి కృష్ణ మాత్రం మాకు ఎటువంటి నోటీసులు ఆఫీస్ ద్వారా అందలేదని ముత్తూట్ కార్యాలయానికి వచ్చి పోల్కంపల్లి పోస్ట్ ఆఫీస్ కార్యాలయానికి ఫోన్ చేయగా ముత్తూట్ ఫైనాన్స్ నుండి  మాకు ఎటువంటి లెటర్ రాలేదని వారు చెప్పడం జరిగింది. ఈ తతంగామంతా ముత్తూట్ ఫిన్ కార్ప్ మేనేజర్ ముందు జరగడం విశేషం. పదేపదే చెబుతున్నా ముత్తూట్ సంస్థ పట్టించుకోకుండా మీరు మా నోటీసుకు స్పందించలేదు అందుకే తులమున్నర (1.5) బంగారం వేలం వేశామని బంగారం డబ్బులు ఫోను మీకు 3000 రూపాయలు మాత్రమే మీకు వస్తాయని మేనేజర్ రాజు తెగేసి చెబుతున్నారు. అదేవిధంగా మీ ఇష్టం వచ్చిన చోట మాపై ఫిర్యాదు  చేసుకోవచ్చని ఇష్టం వచ్చినట్లుగా  కంబాలపల్లి కృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  నన్ను అవమానిస్తూ నీ ఇష్టం ఉన్న  చోట చెప్పుకో అని మాట్లాడి వెనుకకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి నాకు సరైన న్యాయం చేయాలని బాధితుడు కంబాలపల్లి కృష్ణ ఆవేదనతో  విలేకరులతో మొరపెట్టుకున్నారు.