దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 నుండి 14 వయసు పిల్లలకు టీకా

Published: Monday March 21, 2022
హైదరాబాద్ 20 మార్చి ప్రజాపాలన: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 12 మరియు 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో టీకాలు వేయడం జరిగింది. జనగాం జిల్లా దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ కిషోర్ తాల్క ప్రజాపాలన తో మాట్లాడుతూ... 12 నుండి 14 సంవత్సరముల వయస్సు గల పిల్లలందరికీ టీకా మందు ఉచితంగా అన్ని ప్రభుత్వ  వైద్య ఆరోగ్య కేంద్రాల్లో వేయడం జరిగుతుందన్నారు. అనగా  01-01-2008 నుండి 15-03-2010 తేదీ ల మద్య  పుట్టిన వారికి  ఈ  టీకా మాత్రమే వేయాలని నిపుణులు సూచించారు. పిల్లలకు వాక్సినేషన్ వారి యొక్క తల్లి తండ్రి లేదా గురువు సమక్షంలో వేయవలెను అంతేకాకుండా వ్యాక్సిన్ వేసిన పిదప 30 నిమిషాల పాటు పర్యవేక్షణలో ఉంచవలెనని సూచించారు. తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు బాధ్యతగా అర్హులైన పిల్లలకు టీకాలు వేయించాలని వేడుకున్నారు.