*ఇళ్ల పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తాం* -27వ రోజుకు చేరుకున్న భూపోరాటం. -ప్రభుత్వం ఎన్నికల్ల

Published: Monday March 13, 2023

\చేవెళ్ల మర్చి 12,(ప్రజాపాలన):-


చేవెళ్ల మండల కేంద్రంలో సర్వేనెంబర్ 75 లో నాలుగు ఎకరాల రెండు గుంటల ప్రభుత్వ భూమిలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు గత నెల 14వ తేదీన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుణంనేని సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నేటికీ 27 రోజులు గడుస్తున్న సందర్భంగా గుడిసె గుడిసె వాసులను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే రామస్వామి మాట్లాడుతూ గుడిసెలు వేసుకొని 27 రోజులు గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలలో ఇల్లు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తయినా కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్ రూములు నిర్మించి ఇవ్వలేదని అందుకే ఇల్లు లేని పేద ప్రజలు సంఘటితమై ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారని పట్టాలు వచ్చేంతవరకు పోరాటం కొనసాగుతుందని ఉంటే గుడిసెలలో ఉంటాము లేదంటే జైల్లో ఉంటామని గుడిసె వాసులకు భరోసా ఇచ్చారు ప్రభుత్వ అధికారులు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి గుడిసేవాసులకు మౌలిక సదుపాయాలు కరెంటు మంచినీరు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏం ప్రభు లింగం ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ బి కే యం యు జిల్లా అధ్యక్షుడు అంజయ్య మండల పార్టీ కార్యదర్శి మల్గారి సత్తిరెడ్డి  షాబాద్ మండల కార్యదర్శి
జంగయ్య ఏఐటియుసి మండల ప్రధాన కార్యదర్శి శివయ్య అధ్యక్షుడు శివ బిఓసి కార్యదర్శి శ్రీను మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మంజుల విజయమ్మ మీనాక్షి సాయిల్ అమ్మ తదితరులు పాల్గొన్నారు