కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి సేవలు మరువలేనివి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్

Published: Friday May 20, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 19   ప్రజాపాలన  ప్రతినిధి. స్వాతంత్ర్య సమరయోధులు, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 37వ వర్ధంతిని సిపిఎం తుర్కయంజాల్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిన భూని ఘనంగా నివాళులర్పించడం  జరిగింది.
       ఈ సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు, తుర్కయంజాల్ మున్సిపల్ బాధ్యులు డి. కిషన్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య గారు 1913 మే 1న నెల్లూరు జిల్లా అలగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించి తన జీవితమంతా పార్టీ కోసం, ప్రజల కోసం అంకితం చేశారని, ముఖ్యంగా కుల అంతరాలను తొలగించేందుకు సుందర్ రామిరెడ్డి అనే తన పేరులో రెడ్డి అనేటువంటి తోకను తొలగించి  సుందరయ్యగా నామకరణం  చేసుకున్న గొప్ప దీశాలి అని కొనియాడారు. అంతే కాకుండా తన చిన్న తనంలోనే దేశ స్వాతంత్ర ఉద్యమంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రత్యక్షంగా పాల్గొన్న గొప్ప పోరాటయోధుడని అన్నారు.
నేటితరం కమ్యూనిస్టు పార్టీ,నాయకులు , కార్యకర్తలు సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేయాలని అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజల్ని సంఘటితం చేసి ప్రతిఘటన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీ సభ్యులు కొండిగారి శంకర్, సీనియర్ నాయకులు బడుగు శంకరయ్య, కే వెంకట కృష్ణ, గుర్రం జంగయ్య, జగన్, మల్లేష్, మైసయ్య, యాదయ్య, లక్ష్మయ్య, రామకృష్ణ, నరసయ్య, వసురయ్యా, లోకేష్ యాదవ్, శేఖర్ రెడ్డి,  శంకర్, రాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.