కవులు సామాజిక సృహ కలిగి రచనలు చేయాలి

Published: Friday June 03, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 02 ప్రజాపాలన, ప్రతినిధి) : కవులు సామాజిక సృహ కలిగిన రచనలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్  కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన కవి సమ్మేళనం ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలలో చైతన్యం కలిగిన శక్తి కవులకు ఉందని, కవులు ప్రజలలో సామాజిక స్పృహ కలిగించే రచనలు చేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు కళాకారుల ఈ పాత్ర ఎంతో కీలకమైందని అన్నారు. తెలంగాణ అంశంపై చేసిన కవితాగానం అద్భుతంగా ఉందని అభినందించారు. ఈ కవి సమ్మేళనం ఈ కార్యక్రమానికి హాజరైన 32 మంది కవులను శాలువా, ప్రశంసా పత్రం, మెమోరాండం లతో సత్కరించి, రూ 2 వేల  నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు, ఇన్చార్జి డీఈఓ ఉదయ్ బాబు, కవులు  గుర్రాల వెంకటేశ్వర్లు, అవధాని మడుగుల నారాయణ మూర్తి, చిలుకూరి రాధాకృష్ణ చారి, ధర్మపురి వెంకటేశ్వర్లు, కృష్ణమాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.