గణేష్ మండపం ఏర్పాటు కోసం పోలీస్ వారి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి

Published: Monday August 29, 2022

మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి మధిర ఆగస్టు 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీమండల పరిధి లోని వివిధ గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించ దలచినవారు ముందస్తుగా కమిటీని ఏర్పాటు చేసుకోవాలి ఇలా కమిటీలు వేసుకోవాలిఆయా విగ్రహాల దగ్గర ఏది జరిగిన పూర్తి బాధ్యత వారిదే, గ్రామ పంచాయతీ నుండి అనుమతి తీసుకోవాలి, సొంత స్థలాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే వాళ్ళు అట్టి స్థలానికి సంబందించిన యజమాని అనుమతి తప్పనిసరిగా పొందవలెను. విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతులు తప్పనిసరిగా పొందాలి.గ్రామాలలో వివిధ కూడళ్లు వద్ద మండపాలను ఏర్పాటు చేసుకుంటున్నామని పోలీసువారికి తప్పనిసరిగా తెలియజేయాలి. సౌండ్ మైకులను ఏర్పాటు చేసుకోవడానికి పోలీసువారి అనుమతులు తప్పనిసరి. డీజే సౌండ్ లకు అనుమతి లేదు. గణేశ ఉత్సవాలు ఐయ్యేవరకు దేముడు పాటలే పెట్టాలి. మట్టి విగ్రహాల కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. విధికి నాలుగు ఐదు కాకూండా అ విధికి ఒక్కటిగా పెట్టుకునేలా చూడాలి, గణేష్ మండపం దెగ్గర రాత్రిపూట కమిటీ నెంబర్ ఎవరో ఒకలు తప్పనిసరిగా అక్కడ వుండాలి. అదేవిధంగా గణేష్ మండపాల ఏర్పాటు చేసే క్రమంలో రోడ్లు బ్లాక్ కావడం, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆయా ప్రాంతాల్లో గణేష్ మండపాలులి ఏర్పాటు చేసేవారు. పోలీస్ వారికి తగు సమాచారం అందించి వారి నుండి అనుమతులు పొందిన తరువాతనే మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. తెలియజేసిన అన్ని అనుమతి పత్రాలను పోలీస్ స్టేషన్ నందు ఇచ్చి పోలీసుల అనుమతి తీసుకొని మీ కమిటీ పేరు నమోదు చేయించుకోవాలి.విగ్రహం యొక్క ఎత్తు కూడా తప్పనిసరిగా తెలిసి ఉండాలి.అలాగే మున్సిపాలిటీ మండల పరిధిలోని వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకునే భక్తులు, సంఘాల వారు, కమిటీ సభ్యులకు,యువకులకు  http // policeportal.tspolice.gov.in ఈ లింక్ ద్వారా ఎలా ఆన్లైన్ చెయ్యాలి అని కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను మున్సిపాలిటీ మండల ప్రజలు విజయవంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరుచున్నాము