సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత వైద్యాని కై మెడికల్ అటెండెన్స్ బుక్కుల అందజేత

Published: Wednesday March 23, 2022
ముఖ్య అతిథిగా పీకే ఓసి ప్రాజెక్టు అధికారి శ్రీ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో(ప్రజాపాలన):సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ 2 గని లో పనిచేస్తున్న ప్రైవేటు కన్వీనేన్స్ బస్సు డ్రైవర్లకు, భారీ యంత్రాల వాషింగ్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు, ఆయిల్ బ్యాలెన్స్ లోడింగ్ అన్ లోడింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు, భారీ యంత్రాల ట్రాక్ క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు పీకే ఓసి సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో సింగరేణిలో ఉచిత వైద్యానికై మెడికల్ అటెండెన్స్ బుక్ లు అందజేశారు, పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి శ్రీ తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మెడికల్ అటెండేన్స్ బుక్కుల ప్రాధాన్యత వాటి పరిధి గురించి కార్మికులకు వివరించారు.కాంట్రాక్టర్లు మారిన వెంటనే సంబంధిత వివరాలను వైద్య పుస్తకంలో పొందు పరచాలని కూడా తెలిపారు.సింగరేణి పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సంక్షేమం, పిఎఫ్ నామిని మార్పులు చేర్పులు విషయంలో పీకే ఓసి సంక్షేమ విభాగం పనితీరును ఆయన అభినందించారు, ఈ కార్యక్రమంలో గని మేనేజర్ దండమూడి రాంబాబు, రక్షణ అధికారి ఎం లింగబాబు, కళ్యాణ్ రామ్, సీనియర్ పి ఓ ఎండి మదార్ సాహెబ్, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఏరియా ఉపాధ్యక్షులు వి ప్రభాకర్ రావు, షేక్ అబ్దుల్ రవూఫ్, కాపా శివాజీ, సిహెచ్ అశోక్,ఎస్ ఓ పి సమన్వయకర్త ఎస్ డి నా సర్ పాషా,కాంట్రాక్ట్ కార్మికుల సూపర్వైజర్ మాలోత్ రవి,ప్రైవేట్ బస్సు డ్రైవర్ బిక్షం,కాంట్రాక్ట్ కార్మికులు సామ్యేలు, కస్నా, రాజు, చారి, ఖాదర్ బాబు నాగేశ్వరరావు, సాగర్, చిరంజీవి, ప్రసాదు, కృష్ణయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.