డివైయఫ్ఐ రాష్ట్ర నూతన కమిటీ సభ్యుడిగా మద్దాల ప్రభాకర్

Published: Thursday August 05, 2021
మధిర, ఆగస్టు 04, ప్రజాపాలన ప్రతినిధి : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) తెలంగాణ రాష్ట్ర సభ్యుడిగా మద్దాల ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవంతంగా నల్లగొండ జిల్లా చిట్యాలలో ముగిసిన డివైయఫ్ఐ రాష్ట్ర 2వ మహాసభలు. యువజన, విద్యార్థి, ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదం. ఆగస్టు 1, 2 ఆదివారం, సోమవారం తేదీలలో నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగిన డివైయఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 2వ మహాసభలో డివైయఫ్ఐ నూతన రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఖమ్మం జిల్లా మధిర మండలo, తొండల గోపవరం గ్రామానికి చెందిన మద్దాల ప్రభాకర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మధిర మండలంలోని తొండలగోపవరం గ్రామానికి చెందిన మద్దాల ప్రభాకర్ విద్యార్థి దశలో విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐలో విద్యార్థుల సమస్యలపై పని చేశారు, యువకుల, ప్రజా సమస్యల పరిష్కరానికై నిత్యం పోరాడుతూ విద్యార్థి ఉద్యమంలో అనంతరం యువకుల, నిరుద్యోగుల, ప్రజా సమస్యల పరిష్కరనికై పోరాడుతూ ప్రస్తుతం ఖమ్మం జిల్లా DYFI ప్రధాన అధ్యక్షుడుగా నేడు ఖమ్మం జిల్లా నుండి డివైయఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మద్దాల ప్రభాకర్ ఎన్నికైయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాలలో డి. వై.యఫ్.ఐ రాష్ట్ర 2వ మహాసభలు విజయవంతంగా జరిగాయని, మహాసభల ముగింపు సందర్భంగా నిరుద్యోగ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది ఈ మహసభలకు ముఖ్య అతిదులుగా డివైయఫ్ఐ అఖిల భారత కార్యదర్శి అభయ్ ముఖర్జీ, యమ్.యల్.సి నర్సిరెడ్డి గార్లు పాల్గొన్నారని ఆయన తెలిపారు. భవిష్యత్ కార్యక్రమాలపై రూపకల్పన చేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఇవే మహాసభల తీర్మానాలు:
రాష్ట్ర మహాసభలో నేడు విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరనికై పలు తీర్మానాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తీర్మానం, విద్య, వైద్యం లను ప్రైవేట్, కార్పొరేటికరణ చేయడానికి వ్యతిరేకంగా తీర్మానం,స్థానిక సంస్థలో, పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానం, ప్రతి మండల, నియోజకవర్గ కేంద్రాల్లో యువతకు మినీ స్టేడియంలను ఏర్పాటు చేయాలని తీర్మానం, అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న దాడులనకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా అరికట్టాలని తీర్మానం ఇంకా అనేక సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్ లో మహాసభలో తీసుకున్న తీర్మానాలపై, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరనికై రాజీలేని పోరాటాలు చేసేందుకు ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానాలు జరిగినట్లు ఆయన తెలిపారు. ప్రభాకర్ ఎంపిక పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు.