కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి టీఎస్ యుటిఎఫ్

Published: Tuesday August 02, 2022
బోనకల్, ఆగస్టు 01 ప్రజా పాలన ప్రతినిధి: కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం  టీఎస్ యుటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో కేజీబీవీని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండ.రాంబాబు మాట్లాడుతూ కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, మెడికల్ లీవులు మంజూరు చేయాలని, కేర్ టేకర్స్ నియమించాలని, ప్రత్యేక ఎలక్ట్రిషన్ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలకు పని వేళల మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంజీవో జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీఎస్ యుటిఎఫ్ ,ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రాతినిధ్యం మేరకు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల పని వేళల్లో మార్పు చేస్తూ ఉదయం 9.00నుండి 4.30 గంటలకు మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల టీఎస్ యుటిఎఫ్ బోనకల్ మండల కమిటీ హర్షం వ్యక్తం చేసింది. అదేవిధంగా అన్ని గురుకులాల పని వేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ రామకృష్ణ, ఎం సి ఆర్ చంద్ర ప్రసాద్, పి.గోపాలరావు, సధ్దాబాబు, జల్లా కోటయ్య, వి మురళి, రామకృష్ణ, జి శ్రీనివాస్,, కిలారు.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.