నకిలీ సరుకులకు అడ్డాగా మారిన మధిర

Published: Tuesday November 30, 2021
మొన్న నకిలీ చక్ర గోల్డ్ టీ పొడినేడు తలకు రాసుకునే కొబ్బరి నూనె
మధిర నవంబ 29 ప్రజాపాలన ప్రతినిధి : మధిర అడ్డాగా నకిలీ సరుకులుఇంకా మనం తినే తినుబండారాలలో ఎన్ని వస్తువులు నకిలీ నమ్ముతున్నారో. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులు ఇప్పటికే ముగ్గురు వ్యాపారుల పై కేసులు  నమోదు చేసిన పోలీసులు. ఏం కొనాలన్నాఏం తినాలన్నా ఆందోళన చెందుతున్న ప్రజలుఆంధ్రా నుంచి నకిలీవి తెచ్చి తెలంగాణలో అమ్మకాలు. మధిర కేంద్రంగా నడుస్తున్న నకిలీ వ్యాపారాలు. చోద్యం చూస్తున్న సంబంధిత కంపెనీలు, అధికారులు. నకిలీ సరుకుల అమ్మే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. మధిర నియోజకవర్గ కేంద్రంలో నకిలీల కలకలం బయటపడటంతో ప్రజలు మరింత భయాందోళనలు చెందుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం చక్ర గోల్డ్ టీ పొడి నకిలీవి తీసుకువచ్చి తక్కువ ధరకు అమ్మకాలు చేపడుతున్న వైనాన్ని టౌన్ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని మరవకముందే మరో నకిలీ కలకలం లేవడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం సాయంత్రం రాయపట్నం రోడ్లో పల్లపోతు శ్రీను కిరాణా దుకాణంలో పారాషూట్ కొబ్బరినూనె అమ్మకాలు చేపడుతున్న వైనాన్ని టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ చేధించి సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో ప్రజల్లోఅనుమానాలువ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది మధిరలో ఏ ఏ వస్తువులు నకిలీవి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. ధనార్జనే లాభంగా అక్రమ సంపాదనే ధ్యేయంగా కొంతమంది వ్యాపారులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల నుండి నకిలీ వస్తువులను అతి తక్కువ ధరకు తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్మకాలు చేపడుతూ అడ్డగోలుగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణ మొన్న చక్ర గోళ్ళు నకిలీ టీ పొడి నేడు పారాషూట్ కొబ్బరినూనె అమ్మకాలు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు ఇంకా మనం తినే తినుబండారాల వస్తువులలో, ఒంటికి పెట్టుకునే సబ్బుల్లో, ముఖానికి రాసుకుని సుగంధ ద్రవ్యాలలో ఎన్ని నకిలీ ఉన్నాయో..! అనే ఆందోళనకు గురవుతున్నారు. ఏ వ్యాపారీని నమ్మాలి కొంతమంది వ్యాపారులు దేవుడు బొమ్మలు పెట్టి పూజలు చేస్తూ బయట సమాజానికి ఉన్నతమైన వ్యక్తులు గా కనిపిస్తున్నారు. తీరా చూస్తే నకిలీ సరుకులు అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డ తున్నారు. మానవత్వాన్ని మరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కొందరి అక్రమ వ్యాపారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మధిర ప్రాంత ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. కొంతమంది వ్యాపారులు డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని నైతిక విలువలు దిగజారి మనుషులు తినే ఆహారాన్ని, వాడే వస్తువులను నకిలీ వి తీసుకొచ్చి ఈ విధంగా అమ్మకాలు చేపడుతూ ఎంతమంది ప్రాణాలకు హని కలిగిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వివిధ వస్తువులు కి సంబంధించిన ఒరిజినల్ కంపెనీ  యాజమాన్యాలు స్పందించి మీ వస్తువులను నకిలీ చేసి అమ్మకాలు చేపడుతున్నారో.ఎల్లే  లేదా!తెలుసుకోవాలని అదేవిధంగా మధిర కేంద్రంగా జరుగుతున్న నకిలీ వ్యాపారాలపై పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఉక్కుపాదం మోపాలని సంబంధిత వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నకిలీ సరుకుల బారి నుండి ప్రజలను కాపాడాలని మధిర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.