ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చడం అమానుషం : మండల టిడిపి నాయకులు

Published: Friday September 23, 2022

బోనకల్, సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి : ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1986 సంవత్సరంలో విజయవాడలో స్థాపించిన యూనివర్సిటీని ఎన్టీఆర్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగినది. అట్టి యూనివర్సిటీని సెప్టెంబర్ 21వ తేదీన అసెంబ్లీలో వైయస్సార్ యూనివర్సిటీ గా పేరు మార్చాలని వైయస్ జగన్ బిల్లు పాస్ చేయటంపై ఆ పార్టీ నాయకులు గురువారం మండల కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల కీర్తింప చేసిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు అని, అలాంటి నాయకుడి పేరును మార్చి వైయస్సార్ పేరుగా మార్చటంపై మండల తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా యూనివర్సిటీల పేర్లు మార్చటం ప్రజాస్వామ్యంలో అనైతికమని, ఉమ్మడి రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కానీ ఇలాంటి దుశ్చర్య లకి పాల్పడలేదని అన్నారు. యూనివర్సిటీ పేరు మార్చడం పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చిందని, ఇలాంటి చర్యలను తెలుగు ప్రజలు ఎవరు హర్షించరని ఒంటెద్దు పోకడ పోయే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పునరాలోచన చేసి వెంటనే అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును వెనక్కి తీసుకోవాలని, లేకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ, తూటికుంట్ల ఉపసర్పంచ్,మండల ఉపాధ్యక్షుడు తుళ్లూరి కొండలరావు, మండల కార్యదర్శి మరీదు బరకయ్య, రాష్ట్ర గిరిజన సంఘ నాయకుడు బానోతు శివల నాయక్, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు బంధం అనిల్ కుమార్, మండల కార్యదర్శి బండి రామారావు, రావినూతల గ్రామ శాఖ కార్యదర్శి చిత్రాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.