గద్దల ఏడుకొండలుకు మార్పు స్వచ్ఛంద సంస్థ ఆర్థిక చేయూత మార్పు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, శ్రేయోభ

Published: Monday February 20, 2023
బోనకల్, ఫిబ్రవరి 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న గద్దల ఏడుకొండలు‌(26) కు శనివారం మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మార్పు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ముప్పారపు ఉపేందర్ కూతురు ముప్పారపు శాన్వి పుట్టిన రోజు సందర్భంగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వారు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన గద్దల ఏడుకొండలు‌ తండ్రి గద్దల వెంకటరావు ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడని, తన కుమారుడికి వైద్యం చేయించుకోవడానికి దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని వైరా పట్టణానికి చెందిన రాచమల్ల శ్రీను ద్వారా తెలుసుకున్న మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత శనివారం జానకీపురంలోని వారి ఇంటికి వెళ్ళి గద్దల ఏడుకొండలు‌ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి గద్దల ఏడుకొండలుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజం పట్ల బాధ్యతగా ఆపదలో ఉన్నవారికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తున్న మార్పు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి గుడిమెట్ల మోహనరావు, సభ్యులు ముప్పారపు ఉపేందర్, షేక్ హాజిబాబా, రాచమల్ల శ్రీను, తేరాల సతీష్, గద్దల వెంకటరావు, గద్దల స్వరూపారాని తదితరులు పాల్గొన్నారు.