అమాయకుల ప్రాణాలతో చెలగాటమా?: నీలం పద్మ

Published: Monday March 28, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 26 మార్చి ప్రజాపాలన: వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యులు  భగవంతుని తో సమానంగా భావిస్తారు. మన ప్రాణాలను నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తారని వారిపై మనకు అంత నమ్మకం. అలాంటి పవిత్ర మైన వృత్తిని కొందరి నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటన భువనగిరి ఏరియా ఆసుపత్రి లో చోటుచేసుకుంది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాటల్లో... (అనెస్థీసియా) మత్తు మందు ఇచ్చే  డాక్టర్ అంటే రోగి జబ్బు నయం చేయడానికి ఏదైనా (ఆపరేషన్) శస్త్ర చికిత్స చేయాలంటే రోగికి నొప్పి తెలియకుండా ఉండేందుకు మత్తు మందు ఇస్తారు. అలాంటి మత్తు మందు ఇచ్చే డాక్టర్ ఏకంగా 10 మందికి మత్తు మందు ఇచ్చి ఎలాంటి చికిత్స చేయకుండా వెళ్లి నట్టు సమాచారం. దీని వల్ల రోగులు వారి బంధువులు ఆవేదన కు గురి అయినారు. ఏదైన ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది కదా దీనిని బాధ్యులు ఎవరు అని పలువురు అభిప్రాయపడ్డారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే వారు నిరుపేదలేనని అలాంటి వారి ప్రాణాలతో చెలగాటమా? అని ప్రశ్నించారు. పేదలు దేవాలయంలా భావించే ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన లు జరగడం బాధాకరం అన్నారు. ఏదేమైనా ఇలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా రాష్ట్ర స్థాయి అధికారులు చూడాలని తగు చర్యలు తీసుకోవాలని పత్రిక పరంగా కోరడం జరిగిందన్నారు.