శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Tuesday June 29, 2021

అమీన్పూర్, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడ గ్రామం బీహెచ్ఈఎల్ మెట్రో ఎన్క్లేవ్ లో నిర్మించ తలపెట్టిన శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం భూమి పూజలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పురాతన దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ నితీష శ్రీకాంత్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కార్మిక నాయకులు ఎల్లయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.