ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలి పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రంగార

Published: Thursday April 14, 2022
మధిర ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు టీవీ ఎం హరిజనవాడ ఉన్నత పాఠశాలలో మారుతున్న పరిస్థితులకు తగ్గట్లు ఉపాధ్యాయులు కూడా తమ బోధనా నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుచుకోవాలి పి ఆర్ టి యు జిల్లా ప్రధానకార్యదర్శి Rరంగారావుప్రభుత్వ విద్యారంగాన్ని మరింతగా బలోపేతం చేయాల్సిన బాధ్యత  ప్రభుత్వం, ఉపాధ్యాయుల పైన కూడా ఉందని పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి R.రంగారావు పేర్కొన్నారు. మధిర లోని టీవీ ఎంహరిజన వాడ ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులను సందర్శించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగం మీద చిత్త శుద్ధి తో దృష్టి పెట్టాలని, ఉపాధ్యాయ ప్రమోషన్స్, నియామకాల ద్వారా ఖాళీ పోస్టులన్ని భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులపై మరింతగా దృష్టి సారించాలని అప్పుడే పేద, మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యారంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బోధనా సామర్ధ్యాలను మెరుగుపరుచుకుని విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వ పాఠశాలలు మరింతగా బలోపేతం కావడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ పరస్పర బదిలీల్లో సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించినప్పుడే ఉపాధ్యాయులకు న్యాయం జరిగిద్దని పేర్కొన్నారు. 317 జి.ఓ ద్వారా ఇబ్బందులు పడుతున్న స్పౌజ్ మరియు ఇతర ఉపాధ్యాయులకు ప్రభుత్వం త్వరగా వారి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. రంగారావు వెంట పి ఆర్ టి యు రాష్ట్ర బాధ్యులు L.మోహన్రెడ్డి, K.జయరాజు, జిల్లా బాధ్యులు కొమ్ము. శ్రీనివాసరావు, నాయకులు కొలగాని. ప్రసాదరావు, ఎం.డి.జమీర్, పి.సుధాకర్ తదితరులు ఉన్నారు.