బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖ

Published: Wednesday September 28, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ప్రజా పాలన.
 ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తి నందు గల ప్రభుత్వ విప్ కార్యాలయం నందు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి గారి చేసిన ప్రకటనలను ఖండిస్తూ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది...
 ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ
 బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాము, ఇది కిషన్ రెడ్డి మాటను కేంద్ర ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలి, బయ్యారం ఉక్కు, తెలంగాణ హక్కు, తెలంగాణ గిరిజనుల హక్కు, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చింది, ఎన్నో ఆందోళన తర్వాత బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తామని హామీ ఇచ్చింది, 2006 లో రక్షణ స్టీల్ల్స్ కు బయ్యారం గనులు కేటాయిస్తే నిరసనలు వ్యక్తం అయితే అప్పటి ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేసుకుంది, కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణ పై పిడుగు  పాటు లాంటిది, ఏపీ పునర్విభజన  చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం కక్ష పురితంగా వ్యవహరిస్తుంది, బిజెపి తెలంగాణ పట్ల తన వైఖరి పుట్టగతులు ఉండవు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా మాట్లాడారని బయ్యారం  ఉక్కు  ప్రజల హక్కు అని, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అయ్యే ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరించాలనడం బిజెపి చేతగాని తరానికి నిదర్శనం అని అన్నారు, వెంటనే కిషన్ రెడ్డి  వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని మన సమాజానికి క్షమాపణ చెప్పి ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చు  కేంద్రమే భరించి ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని అన్నారు, తెలంగాణ ప్రజలు బిజెపి పార్టీని తరిమి  తరిమి కొడతారని అన్నారు...

 ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వనమా వెంకటేశ్వర్లు,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ దిండిగల రాజేందర్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బానోత్ హరి సింగ్ నాయక్ గారు, ఇల్లందు పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ దమ్మలపాటి వెంకటేశ్వర్లు గారు, TRSV రాష్ట్ర కార్యదర్శి శ్రీ NN రాజు గారు, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శ్రీ సంకు బాపన అనుదీప్ గారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ వట్టం రాంబాబు గారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్వర్, మిట్ట కంటి సురేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు...