ఉపాధి హామీ పనులను పకడ్బందీగా చేపట్టాలి ** ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ **

Published: Friday January 06, 2023
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 5 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ మండలంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పకడ్బందీగా చేపట్టాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలో చేపట్టే ఉపాధి హామీ పనులను సంబంధిత అధికారులు దగ్గర ఉండి పనులను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. రైతులకు ఉపయోగపడే పనులు చేయించాలన్నారు. అలాగే గ్రామాలలో చేపట్టే "మన ఊరు, మన బడి" పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.  శశికళ, ఎంపీఓ ప్రసాద్, ఈజీఎస్, ఏపిఎం, చంద్రశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.