యునిసెఫ్ వారి ఆధ్వర్యంలో అశ్వాపురం పంచాయతీలో రెండవ మహిళా సభ.

Published: Saturday October 15, 2022
అశ్వాపురం మండలం (ప్రజా పాలన).
    ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బానోత్ శారద  అధ్యక్షతన UNICEFవారి ప్రాజెక్ట్ లో భాగంగా రెండవ మహిళా సభను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఈ క్రింది అంశాలు చర్చించడం జరిగింది.
.పారిశుధ్యం, త్రాగునీరు, వీధిదీపాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ, హరితహారం, విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పై చర్చించడం జరిగింది.
మహిళలకు పురుషులతో సమానంగా *సమాన అవకాశా లు కల్పిస్తూ మహిళా సభలు నిర్వహిస్తూ అందులో మహిళలను ఎక్కువ సంఖ్య లో హాజరు అయ్యేలా ప్రోత్సాహించాలని, మహిళలు ఆర్ధిక స్వావలంబనదిశగా అడుగులు వేసేలా స్వయం సహాయక సంఘాలద్వారా రుణాలు తీసుకొని *మహిళా సాధికారత* సాధించాలని, *బడ్జెట్లో, అభివృద్ధి కార్యక్రమాల  అమలు,వేతనాలలో పురుషులతో సమాన వాటా* ఇచ్చి గ్రామ పంచాయతీ ని జెండర్ ఫ్రెండ్లీ ( లింగ స్నేహ పూర్వక )గ్రామ పంచాయతీ* గా మన అశ్వాపురం గ్రామ పంచాయతీని తీర్చిదిద్దుటకు అవసరమగు అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరడమైనది. అదేవిధంగా *మహిళలకు, బాలలకు గల ప్రభుత్వ పధకాలు , చట్టాల అమలు - లోపాలుగురించి చర్చించడం జరిగింది.
       ఈ  కార్యక్రమానికి ముఖ్య  అతిధిగా ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత,ఎంపీడీఓ శ్రీ వరప్రసాద్, ఎంపీవో శ్రీ శ్రీనివాస్, వైస్ సర్పంచ్ శ్రీ చందూలాల్,ఎంపీటీసీ శ్రీమతి గంగా భవాని,వార్డ్ మెంబర్ శ్రీమతి రాధిక,IRMA పరిశీలకులు శ్రీ సంపత్, శ్రీ ఈశ్వర్,ICDS సూపర్వైజర్ శ్రీమతి ధనలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ శ్రీమతి సుందరి,పంచాయతీ కార్యదర్శి శ్రీ కృష్ణ చైతన్య, IKP CC శ్రీమతి రాధారెడ్డి,ANM లు, అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, SHG గ్రూపు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.