గంజాయి రహిత గ్రామాలు గా మారుద్ధం

Published: Wednesday February 02, 2022
కోరుట్ల, ఫిబ్రవరి 01 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళ వారం రోజున కోరుట్ల పట్టణంలోని వాసవి గార్డెన్ లొ గంజాయి నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మెట్పల్లి డిఎస్పి రవీందర్ రెడ్డి. మరియు కోరుట్ల సి.ఐ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ, గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. డ్రగ్స్, గంజాయి ఉత్పత్తి, సరఫరా, రవాణాను గుర్తించి అరికట్టడంలో, అసాంఘిక, అక్రమ కార్యకలాపాల నిరోధించడంలో కౌన్సిలర్లు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు సహకరించి వాటి నివారణకు కృషి చేయాలని మెట్పల్లి డిఎస్పి రవీందర్ రెడ్డి  అన్నారు.జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపీఎస్  ఆదేశాల మేరకు మంగళ వారం రోజున కోరుట్ల పట్టణంలోని వాసవి గార్డెన్ ల వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీల లతో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా మరియు గంజాయి రహిత  గ్రామాలు గా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ  మాట్లాడుతూ గంజాయి కి అలవాటు పడిన వారు తమ బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు గంజాయి నివారణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వం గంజాయి నివారణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించిందని ఈ చట్టం ప్రకారం గంజాయి సాగు చేసిన లేదా సరఫరా చేసిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష కూడా ఉంటుందని అన్నారు. తమ యొక్క గ్రామాలను గంజాయి రహిత గ్రామాలుగా మార్చడం లో సర్పంచ్ ల యొక్క పాత్ర ముఖ్యమని అన్నారు. గంజాయి నివారణకు, గాంజా తాగడం వల్ల జరిగే అనర్ధాలు గురించి గ్రామాల్లో ఉన్న యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో కోరుట్ల సీఐ రాజశేఖర రాజు మున్సిపల్ కమిషనర్ ఆయాజ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పవన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వెంకటరావు, ఎస్.ఐ లు సతీష్, శ్యామ్ రాజు, ఎంపిడిఓ నీరజ, ఎంపీపీ తోట నారాయణ, రాజేష్ ,కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.