వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న సింగరేణి యాజమాన్యం

Published: Saturday June 11, 2022
 ఏ ఐ టి యు సి కేంద్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకట స్వామి
 
మంచిర్యాల బ్యూరో, జూన్10, ప్రజాపాలన:
 
 
కార్మికుల ఆరోగ్య భద్రత ను గాలికొదిలేస్తూ సింగరేణి యాజమాన్యం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఏ ఐ టి యు సి కేంద్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకట స్వామి ఆరోపించారు.శుక్రవారం బెల్లం పెల్లి లో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. కార్మిక సంక్షేమ  రంగాలను నిర్వీర్యం చేస్తున్న సింగరేణి యాజమాన్యం విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయాలని ఏఐటీయూసీ పిలుపు నిచ్చిందని తెలిపారు.  గత కొన్నేళ్ళ క్రితం ఏరియా ఆసుపత్రిలో 500 పైన మెడికల్ వైద్య సిబ్బంది ఉండేదని , ఫిజిషియన్ ఆర్థోపెటిక్ జనరల్ సర్జన్ గైనకాలజిస్ట్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మానసిక వైద్యుడు ఇలా వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్ ఉండడం మూలంగా సింగరేణి కార్మికుల కే కాకుండా బయటి వ్యక్తులు కూడా వైద్యం పొందేవారని అన్నారు. నేడు వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యం కు గురైదని అన్నారు. వివిధ ఏరియాల్లో ఉండే అన్ని ఆసుపత్రులలో మెరుగైన వైద్యం తో పాటు అన్ని రకాల స్పెషలిస్టు డాక్టర్లను నియమించారని డిమాండ్ చేశారు. కార్మికులకు కార్మిక కుటుంబాలకు సంపూర్ణ వైద్య సౌకర్యం కల్పించడం ద్వారా కంపెనీకి ఉత్పత్తి ఉత్పాదకత లకు తోడ్పాటు అందిస్తూ కార్మిక వర్గంలో మానసిక ప్రశాంతతను పెంపొందిస్తూ కంపెనీ ప్రగతికి బాటలు వేస్తారని అన్నారు.  నాటితరం అధికారుల అంకితభావంతో పని చేశారు కానీ నేడు సింగరేణి  అధికారులు వైద్య సౌకర్యం కల్పించే విషయంలో నిమ్మకు నీరెత్తి నట్లుగా వ్యవహరిస్తున్నారని , ఇప్పటి కైనా  సింగరేణి అధికారులు కార్మిక సంక్షేమ రంగాలను పరిపుష్టి చేయాలని విజ్ఞప్తి చేశారు.