ధారూర్ గ్రామాభివృద్ధే ప్రథమ లక్ష్యం * ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు * ప్రజోపయోగ

Published: Thursday September 22, 2022
వికారాబాద్ బ్యూరో 21 సెప్టెంబర్ ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులతో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో వెళ్తున్నాయి. గ్రామాభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం మనసా వాచా ఉంటే తప్పక అభివృద్ధి చెందుతుంది. సర్పంచ్ గా గెలిచి ప్రజలతో అనుసంధానంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో దిట్ట ఉప్పు చంద్రమౌలి. వ్యక్తి పరంగా మృదుస్వభావి సహృదయుడు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడంలో పట్టువదలని విక్రమార్కునిలా కృషి చేసే నేర్పరి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేసే క్రమంలో గ్రామాలకు అధిక నిధులు కేటాయించి,గ్రామాలను అభివృద్ధి దిశలో ముందుకు సాగిస్తుంది.ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు అవసరం అయిన త్రాగునీరు కోసం ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీటిని అందిస్తుంది.వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని దారుర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది.వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నానని దారుర్ గ్రామ సర్పంచ్ ఉప్పు చంద్రమౌళి పేర్కొంటున్నారు.రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు వేదికను నిర్మించాలని సూచించగా దానిని
రూ.22 లక్షలతో నిర్మించారు.ప్రతి పల్లెలో ప్రకృతి వనం వుండాలని గ్రామంలో
రూ.2 లక్షలతో ఎన్ఆర్ఈజిస్ కింద దానిని అభివృద్ధి చేశారు. స్మశాన వాటిక నిర్మాణం కోసం స్మశానవాటిక ప్రభుత్వము నిధులు మంజూరు చేసింది. దానిని వెంటనే పూర్తి చేసి అందుబాటులో తెచ్చారు.గ్రామ పంచాయతీకి ప్రతి నెల కేంద్ర రాష్ట్ర ఆర్ధిక నిధులు రూ.4.50 లక్షలు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ అవుతున్నాయి.దానితో గ్రామంలోని 3వ వార్డులో రూ.7 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం,6వ వార్డులో రూ. 4 లక్షలతో,9వ వార్డులో రూ.3 లక్షలు,10వ వార్డులో రూ. 4లక్షల,1వ వార్డులో సుమారు రూ.5 లక్షలతో సీసీ రోడ్లు వేశారు.గ్రామంలో ఆపరిశుభ్రంగా ఉండొద్దు అనే లక్ష్యంతో అండర్ డ్రైనేజ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి రూ.6 లక్షలుతో అండర్ డ్రైనేజీ వేసి మురుగు కాలువ సమస్యకు పరిష్కారం చూపారు.ప్రజలకు నీటి సమస్య రావొద్దు అనే ఉద్దేశ్యంతో 3 బోర్లు వేసి ప్రజలకు నీటి సమస్య తీర్చారు.వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ సహకారంతో  రూ. 4.50 లక్షల నిధులతో బస్ స్టాండ్ వద్ద అండర్ డ్రైనేజ్ కాలువలు వేశారు. ఎమ్మెల్యే ఆనంద్ నిధులతో గ్రామంలో రూ.4.50 లక్షలతో అంతర్గత డ్రైనేజీ వేశారు.ఎమ్మెల్యే ఆనంద్ నిధులు దాదాపు రూ.9 లక్షలు దారుర్ గ్రామ పంచాయతీకి అందించడం జరిగింది.ప్రజలు రాత్రిపూట ఇబ్బందులు పడకుండా 100 ఎల్ ఈ డి లైట్ లు వేసి గ్రామాన్ని కాంతులతో నింపారు.దారుర్ లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాత సిసి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. నూతనంగా త్వరలో 16 సిసి కెమెరాలు  అందుబాటులోకి తెస్తామని సర్పంచ్ చంద్రమౌళి తెలిపారు.గ్రామ పంచాయతీకి మరిన్ని నిధులు తీసుకువచ్చి  అంబెడ్కర్ చౌరస్తా నుంచి జెండా చౌరస్తా వరకు సిసి రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉండగా ,దాని నిర్మాణం కు దాదాపు రూ.40 లక్షల నిధులు అవసరం అవుతాయని ఎమ్మెల్యే ,మంత్రిని కోరడం జరిగిందని సర్పంచ్ అన్నారు.గ్రామంలో హరితహారం కింద 4 వేయ్యిల మొక్కలు నాటడం జరిగిందని.100 శాతం బ్రతికేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.2000 మొక్కలు జిల్లా కలెక్టర్ నిఖిల అందజేశారు.రైతుల కోసం అల్లనేరేడు, మొక్కలు పంపిణీ చేస్తామని సర్పంచ్ అన్నారు.దానితో పాటు
టేకు మొక్కలు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి రైతులకు చేర్చనున్నారు.ఎస్సి కాలనిలో డ్రైనేజీ పనులు చేపట్టాలని,అనుబంధ గ్రామం అయిన లక్ష్మీ నగర్ తండాలో సీసీ,మురుగు కాలువలు అంచనా రూ. 20 లక్షలతో త్వరలో నిర్మిస్తామని అన్నారు.సంతకు వచ్చే ప్రజలకు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి నూతనంగా మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు  సర్దుబాటు చేసి దారుర్ గ్రామ పంచాయతిని అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తామని సర్పంచ్ ఉప్పు చంద్రమౌళి అన్నారు.