అంగన్ వాడి ఆయా పోస్టులకు నోటిఫికేషన్ లు

Published: Friday August 20, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండలంలోని అంగన్వాడీ, మినీ అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి శాగంటి శైలజ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ, మినీ అంగన్వాడీ ఆయా పోస్టుల వివరాలు వలిగొండ మండలంలోని సంగెం-2 అంగన్ వాడి టీచర్ పోస్టు, ఎదుల్లగూడెం చైతన్యపురిలో మినీ అంగన్వాడి పోస్టులు, ఆయా పోస్టులు వలిగొండ 4 ఎస్సీ, వెల్వర్తి-2 బిసి, మొగిలిపాకలో ఎస్టి, పులిగిల్ల -2 జనరల్, పులిగిల్ల -1 ఎస్సి, ఆయా కేంద్రాల్లో సంబంధిత పోస్టులకు ఈనెల 21 నుండి 30 వరకు సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న వారు సెప్టెంబరు 1.2.వ తారీఖు లోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో హాజరుకాగలరని ఐసిడిఎస్ అధికారి శాగంటి శైలజ తెలిపారు.