భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనది

Published: Saturday November 19, 2022

మధిర నవంబర్ 18 (ప్రజా పాలన ప్రతినిధి) భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనదని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ అన్నారు శుక్రవారం రాష్ట్ర ఆయుష్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆయుష్ కమిషనరేట్ సూపరిండెండెంట్ లింగాల కనకరాజు జయశ్రీ కుమార్తె లింగాల మనీషా దారా ప్రవీణ్ వివాహ నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన లింగాల రవికుమార్  కాబోయే వధూవరులు లింగాల మనీషా దారా ప్రవీణ్ లను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దేశాల కంటే భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నదన్నారు. భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో సాంప్రదాయంగా విలువలతో కూడి ఉంటుందని ఆయన తెలిపారు. కాబోయే నూతన వధూవరులు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఖమ్మం న్యాయవాదుల సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ పాముల దానయ్య ఖమ్మం జిల్లా జాగృతి జిల్లా కన్వీనర్ గుంటి సుందర్ మనో ట్రావెల్స్ అధినేత  రామాల నాగభూషణం ఆయుష్ ఉద్యోగుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు వేముల దిద్దిబాబు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు మద్దెల జయరాజు అమర్లపూడి సురేష్ కల్పన కోర్టు గుమస్తాల సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమాళ్ళ చందు నాయకులు చింతమాల ఆశీర్వాదం పోతుల ఏసుపాదం మధిర ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పాగి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.