మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి స్థలం కేటాయించాలి

Published: Thursday October 20, 2022

మంచిర్యాల టౌన్, అక్టోబర్ 19, ప్రజాపాలన: మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాల పట్టణంలో ప్రతిష్టించుటకు  బెల్లంపల్లి చౌరస్తా నందు స్థలం కేటాయించాలని కోరుతూ  తెలంగాణ బీసీ జాగృతి నాయకులు కలెక్టరేట్ ఏవో సురేష్ కు వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ జాగృతి  జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ  అజ్ఞానమే  అన్ని అనర్థాలకు మూలం  అని, అసమానతలను కలిగి ఉన్న  నిచ్చెనమెట్ల  హిందూ సామాజిక వ్యవస్థ పై తిరుగుబాటు చేసిన వారు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బీసీల దౌర్భాగ్యం వారికి జ్యోతిరావు పూలే ఎవరో తెలియదు, జనాభా ప్రాతిపదికన  ప్రకారం 52 శాతం ఇవ్వాల్సిన రిజర్వేషన్లు 27% కుదిరించబడి, ఉద్యోగ స్థానిక సంస్థలకు  పరిమితం చేయబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి  పట్టణ అధ్యక్షులు  మడుపు రాంప్రకాష్,ప్రధాన కార్యదర్శి  బొలిశెట్టి లక్ష్మణ్,  ఉపాధ్యక్షులు  బోయిన హరికృష్ణ, మెంత్యాల సంతోష్,  కోశాధికారి సల్ల విజయ్ కుమార్, యువ జాగృతి పట్టణ  అధ్యక్షులు మంచర్ల సదానందం, నాయకులు ఎడ్ల పున్నం కుమార్,  గుమ్మల సుదర్శన్, వెన్నంపల్లి రవీందర్,  దేవరకొండ విజయభాస్కర్,  రామగిరి సత్తయ్య, కొండపాక మచ్చయ్య,  భూపతి రమేష్, చిక్కుల రామయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.