జర్నలిస్ట్ లను న్యాయవాదులను ప్రభుత్వం ఆదుకోవాలి

Published: Tuesday May 11, 2021
బీసీ నేతలు ముసిపట్ల లక్ష్మీ నారాయణ జాజాల రమేష్
జగిత్యాల, మే 10 (ప్రజాపాలన ప్రతినిధి): కరోనతో మరణించిన జర్నలిస్ట్ లను, న్యాయవాదులను వెంటనే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి వారికి ప్రత్యేక కేటగిరీ క్రింద వ్యాక్సిన్ లను అందించాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు, న్యాయవాది  జజాల రమేష్ ప్రభుత్వన్ని కోరారు. వారికి ప్రత్యేకంగా ఉచిత వైద్యన్ని అందించాలని కరోనతో మరణించిన  పాత్రికేయులకు రూ.10 లక్షల రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు ఇప్పటికే జర్నలిష్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాయని  ముసిపట్ల లక్ష్మీ నారాయణ, జాజాల రమేష్ తెలిపారు. ప్రభుత్వం న్యాయవాదులకోసం ఏర్పాటు చేసిన సంక్షేమ నిధినుంచి మృతిచెందిన న్యాయవాదుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించాలని, కరోనా భారిన పడ్డ జర్నలిస్టులు న్యాయవాధులతోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉచిత వైద్యసదుపాయం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.