గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

Published: Monday June 28, 2021
ఇబ్రహీంపట్నం, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని వర్ష కొండ గ్రామంలో వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఊరి గ్రామ దేవత పోచమ్మ తల్లికి పెద్ద ఎత్తున ప్రజలు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో, సర్పంచ్ దొంతుల శ్యామలతుక్కారం, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు  పొనుకంటి చిన్న వెంకటి, ఉప సర్పంచ్ మంగిలి పెళ్లి లక్ష్మణ్, సాయిహర్ష, నర్సయ్య, సల్కం శ్రీనివాస్, మరియు అన్ని కులాల సంఘ సభ్యులు పాల్గొన్నారు.