శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం దాత 11 లక్షల 11 రూపాయలు విరాళంమధిర సెప్టెంబర్ 7 ప్రజాపాలన

Published: Thursday September 08, 2022
బుధవారం నాడు వర్తక సంఘంలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు నిత్య నైవేద్య ప్రసాద అన్నదానముల కొరకు కీర్తిశేషులు అరవపల్లి చంద్రయ్య శ్రీమతి రాములమ్మధర్మపత్నికీర్తిశేషులు శ్రీమతి అర్వపల్లి కస్తూరిబాయ్  రెండవ భార్య, కీర్తిశేషులు శ్రీ అర్వపల్లి వెంకటేశ్వరరావు స్వామి కుమారుడు జ్ఞాపకార్థం 11,11,111/-(11 లక్షల 11 రూపాయలు విరాళం ఇచ్చిన దాతలు బుధనకుల గోత్రీకులైన శ్రీ అర్వపల్లి సైదులు గుప్త శ్రీమతి వెంకట నరసమ్మ ధర్మపత్ని కుటుంబం వారిచే ఈ రోజున శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ అధ్యక్షుడు శ్రీ వేముల తిరుపతిరావుకు ఈ చెక్కును అందజేసినారు. ఈ చెక్కును అందజేస్తూ శ్రీ అర్వపల్లి సైదులు గుప్తా మాట్లాడుతూ ఈ విరాళాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి దీని మీద వచ్చిన వడ్డీని మాత్రము దేవాలయ అభివృద్ధి కొరకు మరియు అన్నదానాల కొరకు వాడవలసిందిగా దేవాలయ కమిటీని కోరడం జరిగింది. మా సొంత ఊరు మధిర కాబట్టి ఇప్పుడు మేము* *హైదరాబాదులో స్థిరపడ్డా కూడా మా మధిర ప్రజలు కోసం మధిర ప్రజల అభివృద్ధి కోసం ఈ విరాళాన్ని మా నాన్న దగ్గర నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి ఈ విరాళాన్ని దేవాలయానికి ఇవ్వాలని కోరుకున్నాను*కాబట్టి* *అలాగే మా నాన్న  ఆశయం నెరవేర్చటం కోసం మధిరలో ఉన్న ఈ వర్తక సంఘ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇచ్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు నిర్ణయించుకున్నాను* అందుకనే ఈ విరాళాన్ని దేవాలయానికి అందజేసినారు. తదుపరి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని శ్రీ అర్వపల్లి సైదులు గుప్తా గారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వేముల తిరుపతిరావు సత్యబాబు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి అధ్యక్షులు కపిల్వాయి జగన్ మోహన్ రావు చంద్రశేఖర్ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు