బైకు అదుపు తప్పి ప్రమాదవశాత్తూ కొవ్వూరి శ్రీనివాసులు మరణించారు

Published: Wednesday April 27, 2022

ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 26 ప్రజాపాలన ప్రతినిధి : తేదీ: 26.04.2022 నాడు ఉదయం 10:00 గంటలకు కొవ్వూరి శ్రీనివాసులు, తండ్రి: కోటయ్య, వయస్సు: 50 సం.లు, వృత్తి: కల్వకుర్తి డిపో RTC కండక్టర్, నివాసం: తుర్కయంజాల్, అబ్దుల్లాపూర్మెట్ మండలం, రంగా రెడ్డి జిల్లా. నివాసి తన స్వంత గ్రామమైన బ్రహ్మణపల్లి, మాడ్గుల్ మండలం, రంగా రెడ్డి జిల్లా నుండి తన యొక్క బైక్ AP 22 AG 582 పై బయల్దేరి వస్తుండగా మార్గ మద్యలో మద్యాహ్నం 2 గంటలకు ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామం వద్దకు చేరుకోగానే అతని యొక్క బైక్ అదుపు తప్పి తనంతటతానే క్రింద పడిపోగ అతని యొక్క ఛాతికి బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం అతనిని మాక్సీ క్యూర్ హాస్పిటల్ BN రెడ్డి నందు అడ్మిట్ చేయగా అతను చికిత్స పొందుతూ సుమారు 4:00 గంటలకు చనిపోయినాడు. ఇట్టి విషయం పై కొవ్వూరి శ్రీనివాసులు యొక్క అల్లుడైన బొమిశెట్టి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు పై ఇబ్రహీంపట్నం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు.