రైల్వే కాంట్రాక్టు కార్మికులందరికి కనీస వేతనాలు చెల్లించాలి

Published: Wednesday August 03, 2022

మంచిర్యాల టౌన్, ఆగష్టు 02, ప్రజాపాలన: తెలంగాణ రైల్వే క్యాజువల్, కాంట్రాక్టు,ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం రోజున బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో వివిధ విభాగలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కలిసి వారి సమస్యలు పరిష్కారం దిశగా సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా రైల్వే యూనియన్ రాష్ట్ర  కమిటీ నాయకులు ముంజం ఆనంద్ మాట్లాడుతూ రైల్వేలోని అన్ని విభాగలలో పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. లాక్ డౌన్ పేరుతో కాంట్రాక్టు కార్మికులను తగ్గించారు. ఫలితంగా కొంతమంది ఉపాధి కోల్పోయారు. ఉన్న కార్మికులపై పని భారం పెరిగింది. గూడ్స్ షెడ్స్, పార్షిల్ హమాలీల పని కూడా తగ్గింది. కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడంలేదు. అనేక చోట్ల కార్మికుల పేరుతో కాంట్రాక్టర్లే అకౌంట్ ఓపెన్ చేసి పాస్ పుస్తకాలు, ఎటిఎం కార్డ్స్ లు వారి వద్దనే ఉంచుకున్నారు. ప్రమాదం జరిగితే వైద్యం చేయించడం లేదు. నష్టపరిహారం ఇవ్వడం లేదు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులాన్ని రోజు పెరుగుతూనే ఉన్నాయి. కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదు అని మండిపడ్డారు.కాంట్రాక్టు కార్మికులందరిని క్రమబద్దికరించాలాని అన్నారు.కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి ఇప్పుడున్న కాంట్రాక్టు కార్మికులు అందరిని శాశ్వత స్వభావం కలిగిన పనులన్నింటిలో రైల్వేలో ఉద్యోగలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రంజిత్ కుమార్, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ లో వివిధ విభాగలలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.