చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలి ** "ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా", "జిల

Published: Friday September 09, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్08 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఇటీవల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ 50 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించరు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లలో కనీస మౌలిక  సౌకర్యాలు భోజనం సరిగా లేక, మరుగుదొడ్లు, మూత్రశాలలు  లేక పోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆశ్రమ గురుకుల హాస్టల్స్ లలో కూడా విద్యార్థులు అధిక సంఖ్యలో 600 కు పైగా ఉంటున్నారని, కానీ నేను మరుగుదొడ్లు మాత్రం 4,5, ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటి వరకూ హాస్టళ్లలో విష జ్వరాలతో 5 గురు విద్యార్థులు మృతి చెందడం జరిగింది అని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం,రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జైళ్ళ కన్న హినంగా సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని అన్నారు. ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో ఆహారం బాగా లేక, మౌలిక సదుపాయాలు లేక,  విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనేఅన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అరుణ్ కుమార్,రవి, కృష్ణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area