జన్నారం, డిసెంబర్ 23, ప్రజాపాలన: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు నిర్వహించిన మ్యా

Published: Saturday December 24, 2022

జన్నారం, డిసెంబర్ 23, ప్రజాపాలన: శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షలలో స్లేట్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్ర జిల్లా స్థాయిలో బహుమతులను సాధించడం జరిగిందని అ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని స్లేట్ హైస్కూల్లో మాట్లాడుతూ డి అభిరామ్ స్టేట్ లెవెల్, బి ఆశ్రిత్ కుమార్, ఒ మురళీ కృష్ణ, కె అశ్విత్, టి శ్రీమయి, పి సహస్ర డిస్ట్రిక్ట్ లెవెల్ టి శ్రీమయి, డి కార్తీక్, బి.శ్రేయస్, జె మణివణ్ణన్, రిషిత్ డిస్ట్రిక్ట్ కన్సోలేషన్ బహుమతులు సాధించారన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రొఫెసర్ ఎన్ వి ఎన్ఐటి వరంగల్, జబర్దస్త్ ఫేమ్ అప్పారావు, రాజమౌళి మరియు తుమ్మ అమరేశ్, ప్రెసిడెంట్, ఎస్ ఆర్ ఎఫ్ హైదారాబాద్ గారి చేతుల మీదుగా బహుమతులను అందించారు. ఈ బహుమతులు పొందిన విద్యార్థులను స్కూల్ ప్రిన్సిపాల్ ఏ శ్రీకాంత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, తదితరులు అభినందించారు.