మానేశారు వంతెన వద్ద బి.ఆర్ అంబేడ్కర్, ని వివేకనంద హైలాండ్స్ సుందరీకరిస్తాం.

Published: Friday July 08, 2022
త్వరలోనే నగరంలో 13 జంక్షన్ లను 5 కోట్ల తో    ఏర్పాటు చేయబోతున్నాం
 
నగర మేయర్ సునిల్ రావు 
 
కరీంనగర్ జూలై 7 ప్రజాపాలన ప్రతినిధి :
మహనీయుల ఆశయాల ఆచరిస్తూ వారిని గౌరవించడం మన అందరి బాధ్యతగా గుర్తెరుగాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా గురువారం రోజు మహనీయుల విగ్రహాల హైలాండ్స్ అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ భూమి పూజ చేశారు. నగరంలోని 58,59 డివిజన్ల పరిధిలోని శివ థియేటర్ వద్ద గల వివేకానంద విగ్రహం హైలాండ్ సుందరీకరణ కు కమీషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, కార్పొరేటర్లు రాపర్తి విజయ, గందె మాధవి మహేష్ తో కలిసి 10 లక్షల నిధులతో హైలాండ్ అభివృద్ధికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం 8 వ డివిజన్ పరిధిలో గల మానేశారు వంతెన వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం, హైలాండ్ జంక్షన్ 36 లక్షల నిధులతో అభివృద్ధి చేసేందుకు స్థానిక కార్పొరేటర్ చల్ల శారద రవీందర్ తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ... భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తులు మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, స్వామి వివేకానంద విగ్రహాల హైలాండ్స్ ను అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అంబేద్కర్, స్వామి వివేకానంద ఆశయాలను అనుసరిస్తూ వారిని గౌరవించడం మనందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. ఇందులో భాగంగా విగ్రహ ఐలాండ్ లను అందంగా తీర్చిదిద్దేందుకు ఈరోజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. మన కొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చాలా కాలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైలాండ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. వారి కోరిక మేరకు స్థానిక కార్పొరేటర్ చల్ల శారద  వినతి పత్రం దించడం జరిగిందన్నారు. రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలను అన్ని హంగులతో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 15 లక్షలతో చక్కటి విగ్రహం, 21 లక్షలతో  హైలాండ్ ను సుంధరీకరిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ నగరానికి వచ్చే ప్రజలకు మహనీయుని చక్కటి రూపం కనబడే విధంగా హైలాండ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతే కాకుండా మహనీయులు స్వామి వివేకానంద ఆశయాలను కూడా మనమంతా అనుసరిస్తూ... గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు. 58 59 డివిజన్లో పరిధిలో గల శివ థియేటర్ సమీపంలో ఉన్న స్వామి వివేకనంద విగ్రహం ఐలాండ్ ను కూడా అన్ని హంగులతో సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పది లక్షల నిధులతో హైలాండ్ ను అందంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రెండు విగ్రహాల ఏర్పాటుతో నగరానికి నూతన శోభ సంతరించుకుంటుందని తెలిపారు. అంతే కాకుండా నగరంలో 13 హైలాండ్ జంక్షన్ ను 5 కోట్ల రూపాయల నిధులతో త్వరలో నిర్మాణం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. . నాలుగు మాసాలు జంక్షన్ హైలాండ్ సుందరీకరణ పనులను వేగవంతంగా పూర్తి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీస్తామన్నారు.  నగరంలో ఇప్పటికే 8 కోట్ల రూపాయలతో ప్రజలకు ఆహ్లాదం పంచే విధంగా పార్కులను కూడా అభివృద్ధి చేశామన్నారు. కొన్ని పార్కులు పురోగతి దశలో ఉన్నట్లు స్పష్టం చేశారు. నగర ప్రజలకు రోడ్లు డ్రైనేజీలు వీధి దీపాలు మంచినీటి సరఫరా ఇలాంటి సౌకర్యాలతో పాటు నగరంలో పార్కులను గ్రేవియార్డులను కూడా అందంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. త్వరలో నగరంలో ఎక్కడ స్థలం ఉన్నా ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చర్ల స్వరూపరాణి హరిశంకర్, రాపర్తి విజయ, గందె మాధవి మహేష్, సల్ల శారద రవీందర్, ఈఈ కిష్టప్ప, డీఈ ఓం ప్రకాష్, ఏఈ, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.