బూర్గంపాడులో జిల్లా వైద్యాధికారి రవి ఆకస్మిక తనిఖీ. బూర్గంపాడు (ప్రజా పాలన.)

Published: Friday November 11, 2022

భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ కి నుతనంగా విచ్చేసిన నలుగురు వైద్యాధికారులు. ఈ సందర్భంగా ఈ క్రమంలో మొదటి సారి బూర్గంపహడ్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి డిసిహెచ్ఎస్  రవి కుమార్ ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్లకు పలు సూచనలు  సలహాలు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్లు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు డాక్టర్లకు సూచించడం జరిగినది.