బోనకల్ తహశీల్దార్ కార్యాలయం ముందు గ్రామ రెవెన్యూ సహాయకుల నిరసన

Published: Tuesday February 08, 2022
బోనకల్, ఫిబ్రవరి 7 ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణ గ్రామ రెవెన్యూ సహయకుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా బోనకల్ మండల వీఆర్ఏల అధ్యక్షులు మర్శకట్ల సుధాకర్, కార్యదర్శి మరీదు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  బోనకల్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ముఖ్యమంత్రి కే సి ఆర్ అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా వీఆర్ఏ లకు పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్ లు కల్పించాలని, 55 సం: నిండిన వారి వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ, అందరికీ హెల్త్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా న్యాయమైన డిమాండ్లుతో కూడిన మెమోరాండంను తహసీల్దార్ కు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా వీఆర్ఏ సంఘం సభ్యులు మరీదు వెంకటేశ్వర్లుతో పాటు, జానకిరాములు, రవీందర్, కోటేశ్వరి, నాగేంద్ర, నాగలక్ష్మి, మీరా, ప్రసాద్, వలి, అప్పయ్య, రాజేష్, అక్బర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.