57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ లు అందజేయాలి : మెరుగు

Published: Tuesday April 20, 2021
మధిర, ఏప్రిల్ 19, ప్రజాపాలన ప్రతినిధి : మెరుగుసత్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుస్థానిక బోడేపూడి భవన్ నందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మధిర మండల కమిటీ సమావేశం అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలు పేదలు 57 సంవత్సరాలు నిండి ప్రభుత్వం ఇవ్వవలసిన పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని అర్హత ఉన్నా కూడా రేషన్ కార్డులు లేక పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తో నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయలేని స్థితిలో పౌష్టికాహారం అందక రోగాల పాలవుతున్నారు అని అన్నారు చౌక దుకాణాల ద్వారా పేద ప్రజలకు 18 రకాల నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు పనిప్రదేశాల్లో వ్యవసాయ కూలీలకు కరోనా వ్యాక్సిన్ అందించాలని ఉపాధి హామీ పథకం ద్వారా కనీస వేతనం 600 రూపాయలు ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పనిలో ఫీల్డ్ అసిస్టెంట్ ను మెట్లను విధుల్లోకి తీసుకుని ప్రజలందరికీ ఉపాధి హామీ పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండవ కృష్ణారావు సంగం మండల కార్యదర్శి ఓట్ల శంకర్రావు సంఘ నాయకులు నాయుడు శ్రీరాములు మోహన్రావు రమణ ధనలక్ష్మి బేగం నాగేశ్వరరావు సుధాకర్ కృష్ణయ్య నరేష్ రాము మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు