బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో కార్పొరేట్ స్థాయి విద్య

Published: Friday May 20, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 19 మే ప్రజాపాలన :
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ  కమీషనర్ ఆదేశానుసారం  జిల్లా లోని వివిధ పాఠశాల స్థాయి గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు  బెస్ట్ అవైలబుల్ స్కూల్ (BAS ) పథకం  ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను హాస్టల్ వసతితో అందించుటకు , అర్హత గల ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల నుండి దరఖాస్తులు కొరబడుచున్నవని జిల్లా కలెక్టర్ నిఖిల ఒక ప్రకటనలో తెలిపారు.  ఆసక్తి  గల పాఠశాలలు ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకోగలరని తెలియజేసారు. జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ బెస్ట్ అవైలబుల్  స్కూల్ పథకం  ద్వారా ఒక్కో విద్యార్ధికి నెలకు రూ.3000/- చొప్పున స్కాలర్షిప్ ఈ పాస్ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. 3వ, 5వ, మరియు 8వ  తరగతుల  గిరిజన విద్యార్థిని, విద్యార్థుల అడ్మిషన్ల కొరకు  ప్రైవేట్ పాఠశాల  యాజమాన్యం నుండి దరఖాస్తులు కోరుచున్నాము. ఇతర వివరాలకు ఫోన్ నం. 8639388553, 9908120296
 సంప్రదించగలరని తెలిపారు.