బీరుపూర్ మండలంలో మే 21న అంగన్వాడీ నిత్యావసర సరుకులు పంపిణీ

Published: Thursday May 20, 2021
ఏ సమస్యలు ఉన్నా టోల్ ప్రి నంబర్లకు ఫోన్ చేయండి
బీరుపూర్, మే 19 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మరియు సారంగాపూర్ మండలాల్లో అన్ని గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలలో ఐసీడీఎస్ ద్వారా అందించే టిహెచ్ఆర్ ప్రభుత్వ పథకంలో భాగంగా తేదీ మే 21 శుక్రవారం రోజున లబ్ధిదారులకు గ్రామ పాలకవర్గం సర్పంచ్ ఎంపీటీసీ వార్డ్ సభ్యుల సమక్షంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె గుడ్లు కూర్కూరే బాలమృతం పాలు పంపిణీ చేయడం జరుగుతుందని బీరుపూర్ అంగన్వాడీ సూపర్వైజర్ కుసుమ ఒక ప్రకటనలో తెలిపారు. మరియు మహిళలు పిల్లలు దివ్యంగులు వయోవృదులు ఉంటే సంక్షేమ శాఖ అందించే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చెయ్యవచ్చని చిన్న పిల్లలైతే 040 - 23733665 టోల్ ప్రి నంబర్, మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా 181 టోల్ ప్రి నెంబర్, వయోవృదులకు ఎలాంటి సమస్యలు ఉన్న 14567 నెంబర్ కి ఫోన్ చేయవచ్చును. దివ్యంగులకు కోవిద్ కరోనా ఎలాంటి సమస్యలు సలహాల కోసం 1800- 572-8980 ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్ తెలిపారు.