డాక్టర్ కె.ఆర్ మేఘనాథ్ నేతృత్వంలో శిక్షణా తరగతులు దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి 100 మందికి పై

Published: Tuesday July 26, 2022

మా ఇ.ఎన్.టి ఆధ్వర్యంలో విజయవంతంగా 64వ లైవ్ సర్జికల్ వర్క్ షాప్

హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్న మా ఇ.ఎన్.టి ఆస్పత్రి అద్వర్యం లో  64వ లైవ్ సర్జికల్ వర్క్ షాప్ ను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్  కె.ఆర్ మేఘనాథ్ మాట్లాడుతూ.. ఇ.ఎన్.టి విభాగంలో ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలుపెట్టిన వైద్యుల శిక్షణ నిమిత్తం  తమ హాస్పిటల్  అద్వర్యం లో తరచుగా ఇలాంటి వర్క్ షాప్ లు నిర్వహిస్తోందని తెలిపారు. కేవలం చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులకే కాకుండా తల , మేడ, కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలకు మా ఇ.ఎన్.టి అసలైన చిరునామాగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ లకు దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి 100 మందికి పైగా డాక్టర్లు  హాజరు కాగా డాక్టర్   కె.ఆర్ మేఘనాథ్ ఆధ్వర్యంలో  వైద్యులు తుషార్ కాంతి ఘోష్, రామకృష్ణ,  వెంకట్ రామ్ రెడ్డి,  కిరణ్, బెంజమిన్,  మనీష్ గుప్తా వంటి నిష్ణాతులు శిక్షణ ని ఇచ్చారు. ఈ వర్క్ షాప్ లలో దారిద్య్ర రేఖకు దిగువనున్న 25 మంది రోగులను ఎంపిక చేసి వారికి పూర్తి ఉచితంగా శస్త్ర చికిత్సలను నిర్వహించారు.  సైనసైటిస్, చెవి నుంచి చీము కారడం, నోస్ బ్లాక్, తలనొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న రోగులకు … టిమ్పనోప్లాస్టీ, మాస్టోయిడెక్టమీ, సైనస్ సర్జరీ, అడెనాయిడ్  టాన్సిల్ శస్త్ర చికిత్సలు చేశారు. 
వైద్యుల్లో విశ్వాసాన్ని పెంపొందించడం, వారంతా నమ్మకంగా ధైర్యంగా ఇ.ఎన్.టి సర్జరీలు చేసేలా ప్రేరేపించడమే ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మంచి విజయాలు  సాధించేందుకు, డాక్టర్ల సక్సెస్ రేటు పెంచేందుకు ఈ వర్క్ షాప్ లు దోహదపడుతాయని తెలిపారు.