విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో వ్యక్తికి తీవ్ర గాయాలు

Published: Tuesday February 01, 2022

కోరుట్ల, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల పట్టణంలోని విద్యుత్ అధికారులు గత కొన్ని రోజుల నుంచి పనులు చేపట్టగా పట్టణంలోని పలు చోట్ల నిర్లక్ష్యంగా పనిచేస్తూ రోడ్డుకు అడ్డంగా కేబుల్ వైర్ కత్తిరించడం తో ద్విచక్రవాహనంపై వెళ్తున్న తునికి రాజేష్ వ్యక్తి మెడకు కేబుల్ వైర్ చుట్టుకో గా కొంత దూరం వరకు ఆ కేబుల్ వైర్ మెడకు ఉండడం వలన బైక్ మీద నుంచి కింద పడడంతో బైక్ మీద ఉన్న వ్యక్తులు అందరికీ తీవ్ర గాయాలు స్థానికులు వెంటనే స్పందించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు మాట్లాడుతూ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో కేబుల్ వైర్ మెడకు చుట్టుకోవడంతో మెడకు తీవ్ర గాయం అయింది బైక్ పై కింద పడినప్పుడు బైక్ మీద ఉన్న వ్యక్తులు అందరికీ తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. విద్యుత్ అధికారులు మాట్లాడుతూ గాయపడ్డ వారికి సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారని వారు తెలిపారు గాయపడ్డ వ్యక్తి కుమారుడు తునికి నిఖిల్ మాట్లాడుతూ ఈ ప్రమాదం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది మా తండ్రి సిర్పూర్ గ్రామం నుంచి బొమ్మెర గ్రామానికి వెళ్తుండగా కోరుట్ల లోని బస్టాండ్ ఇన్ గేట్ వద్ద విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని తునికి నిఖిల్ తెలిపారు.