ఎన్ సి డి మందుల కిట్ల పంపిణీ*

Published: Tuesday November 22, 2022
మధిర రూరల్ నవంబర్ 21 ( ప్రజాపాలన ప్రతినిధి) మండల పరిధిలోని మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం పీహెచ్సీ వైద్యాధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్ సి డి(నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) మందుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సిడి అంటే అంటు వ్యాధులు కానివి అని తెలిపారు. షుగర్, బిపి మందులను వాడుతున్న వారికి అన్ని గ్రామాల ఆశా కార్యకర్తల ద్వారా నెలకి సరిపోను మందులు ఈ కిట్ బ్యాగ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందన్నారు.                
ఈ మందుల ద్వారా ఉన్నతమైన జీవనానికి, ఆరోగ్యకరమైన అలవాట్లు గురించి, అధిక రక్తపోటు, చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. ఈ మందులు చదువురాని వారు కూడా సులువైన పద్ధతిలో గ్రహించుటకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రంగుల కవర్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఊటుకూరు భాస్కరరావు తదితరులు  పాల్గొన్నారు.