మహిళలకు అండగా రోషిణి వాలెంటరీ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది

Published: Thursday November 25, 2021
మధిర నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : మండల రోషిణి వాలంటీర్ ఆర్గనైజేషన్, అధ్యక్షురాలు, Y సుజాతమహిళలకు అండగా రోషిణి వాలంటీర్ ఆర్గనైజేషన్ నిత్యం పనిచేస్తుందని మధిర మండల అధ్యక్షురాలు Y సుజాత చెప్పారు, ఈరోజు మధిరలో మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, అధ్యక్షురాలు గా Y సుజాత, ఉపాధ్యక్షురాలుగా, M మాణిక్యం, ప్రధాన కార్యదర్శి గా, Y ప్రసాదరావు, కార్యదర్శి గా, P సువర్ణ, కోశాధికారి గా Ch విజయలక్ష్మి, సభ్యులు గా, P లక్ష్మి, K అనసూర్య, K సువార్తలను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగాఅధ్యక్షురాలు సుజాత మాట్లాడుతూ, మహిళలుపై జరుగుతున్నా అత్యాచారాలు మానభంగాలు, అవమానాలు, ఈ నాటికి సమాజములో మహిళలు ప్రతి నిత్యం ఎదుర్కొటున్నారు, వాటిని నివారించేందుకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అవి ఆగటం లేదని, సుజాత ఆవేదన వ్యక్తం చేశారు, స్త్రీ లను హింసించటం అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లాంఘన కిందకు వస్తుందని ఆమె పేర్కొన్నారు, రాష్ట్ర ప్రభుత్వం షి టీమ్ 181 హెల్ప్ లైన్ వంటివి మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిందని చట్టాలు ఎంత కఠినంగా ఉన్న మగవారిలో మార్పు రావడం లేదని ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుండే మంచి విషయాలు చెప్పితే వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్లకుండా మార్పు తీసుకురావాలని చూచించారు.