ఆయుష్ డిపార్ట్మెంట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అ

Published: Saturday July 30, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ ప్రజాపాలన ప్రతినిధి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఉమార్ ఖాన్ గూడలో ఉచిత వైద్య శిబిరాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసి కరాడి శ్రీలత అనిల్ కుమార్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ వారు చేతులు మీదుగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరాడి శ్రీలత అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉంటేనే సుఖసంతోషాలతో ఉంటారని ప్రజలందరి సుభిక్షం కోసం అకాల వర్షాల నుంచి ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు, అంటువ్యాధులు గాని ఆరోగ్య సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి ఆయుష్ డిపార్ట్మెంట్ సహకారంతో మన గ్రామంలో వార్డు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్. వసంతారావు,డాక్టర్ జి. రమాదేవి మెడికల్ ఆఫీసర్, సిహెచ్ సుచిత్ర ఫార్మసిస్ట్, కే గణేష్ . ఎం ఎన్ ఓ వసంత P. T. S., K. భారతి, స్థానిక నాయకులు లక్ష్మారెడ్డి , నల్ల బాల్ రెడ్డి, గడ్డం బాలయ్య, గడ్డం యాదయ్య, శ్రీకాంత్ రెడ్డి, వర్ధ రంగనాథ్ గౌడ్, బండారు బాలరాజ్ అలాగే మున్సిపల్ సిబ్బంది పంది మురళి, బాలయ్య, యాదగిరి, నరసింహ పెద్ద ఎత్తున స్థానికులు తదితరులు పాల్గొనడం జరిగింది.