తెలంగాణ బడ్జెట్ లో గల్ఫ్ కార్మికులకు అన్యాయం

Published: Saturday March 20, 2021

రాష్ట్ర ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ సంద సుదర్శన్, పెరుగు మల్లికార్జున్


మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 19, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లు కేటాయించక పోవడాన్ని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంద సుదర్శన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వారు దుబాయ్ నుండి ప్రజాపాలన తో మాట్లాడారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు  రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెడుతూ గల్ఫ్ కార్మికులను సానుభూతి తో ఆదుకుంటామని ప్రస్తావించారు రాష్ట్ర ప్రభుత్వం సానుభూతి తో ఆదుకోవడానికి గల్ఫ్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గల్ఫ్ కార్మికులు బిచ్చం అడగడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి వలస వెళ్లిన 15 లక్షల మంది వారి వేతనాలను రాష్ట్రానికి పంపడం ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి రెండు నుండి నాలుగు వెల కోట్ల ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 500 కోట్లు కేటాయిస్తే ప్రభుత్వం కు వచ్చే నష్టమేంటి అని ప్రశ్నించారు. గల్ఫ్ కార్మికుల మీద చిన్ని చూపుతున్న తగదని అన్నారు. తెలంగాణ గల్ఫ్ కార్మికులంత ఏకమయ్యి మా ప్రణాళికను విస్తృతం చేసి మా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కల్లెడ భూమన్న, గౌరవ అధ్యక్షుడు సేపూరి గోపాల్, ప్రధానకార్యదర్శి అమరగొండ తిరుపతి, కన్వీనర్ పురంశెట్టి నాగేష్, అధికారప్రతినిధి ఎరుకల రాజు గౌడ్, ముఖ్య సలహదారులు ఎండి హస్సన్, కార్యదర్శులు జునుగురి నాగరాజు, అమరగొండ మల్లేష్ లు ఉన్నారు.