గంజాయి ప్యాకెట్లు, ఆశిష్ నూనె విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు

Published: Monday October 11, 2021

బాలాపూర్: అక్టోబర్10, ప్రజాపాలన ప్రతినిధి : అక్రమంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన మీర్ పేట్ పోలీసులు. నిందితుల నుంచి ఆరు వందల గ్రాముల గంజాయి పౌడర్, 8 మిల్లీ లీటర్ల ద్రావకంతో గంజాయ్, అదేవిధంగా 7 స్మార్ట్ ఫోన్స్, రెండు ద్విచక్ర వాహనములు స్వాధీనం చేసుకున్నారు.మీర్ పేట్ సీఐ మహేందర్ రెడ్డి తో పాటు డీ ఐ సత్యనారాయణ తో కలిసి వనస్థలిపురం ఏసిపి పురుషోత్తం రెడ్డి మీడియా కు వెల్లడించారు. మీర్ పేట సమీపంలో ఉన్న హుడా కాలనీకి చెందిన వి. సంతోష్ (19) బడంగ్ పేట్ లో ఉద్యోగ నగర్ కాలనీకి చెందిన రవ్వ ఫిలిప్స్ కళ్యాణ్ (35) కర్మన్ గట్టు నందనవనం చెందిన సయ్యద్ అజీజ్ (23) ప్రకాశం జిల్లా బండే పాలం కు చెందిన బుర్స్ నరేంద్ర శ్రీనివాస్ (24) వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు. దూల్ పేట్ నుంచి గంజాయిని తెచ్చి తెలిసినవారికి అమ్ముతున్న కళ్యాణ్ ను లేనిన్ నగర్ చెరువు కట్ట పై పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ అదే ప్రాంతానికి చెందిన జిత్తు దగ్గర గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి నందనవనం లో అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయ్ ఆకు నుంచి వచ్చే ఆశిశ్ నూనెను నాని అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారనీ చెప్పారు. వీరితో పాటు ముగ్గురు వ్యక్తులు (శోభ, జిత్తు, నాని) పరారీలో ఉన్నట్లు తెలిపారు.