మధ్యాహ్న భోజన నిర్వాహకుల వేతనాలు చెల్లించాలని రాస్తారోకో

Published: Thursday December 16, 2021
మంచిర్యాల బ్యూరో‌, (దండేపల్లి) డిసెంబర్ 15, ప్రజాపాలన : ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకుల వేతనాలు పెంచాలని కోరుతూ మంచిర్యాల జిల్లా దండెపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై నిర్వాహకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వాహకుల జిల్లా అధ్యక్షుడు శ్రీదేవి మాట్లాడుతూ కూరగాయల రేట్లు పెరిగినందున ఒక్కో విద్యార్థికి పన్నెండు రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కోడి గుడ్డు కు ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లిస్తుందని ప్రస్తుతం ఏడు రూపాయలకు పెరిగిందని కోడి గుడ్డు కు ఏడు రూపాయలు చెల్లించాలని వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గౌరవ వేతనం ప్రతి నెల పది వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. రాస్తారోకో చేస్తున్న నిర్వాహకులకు బిజెపి, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు, సతీష్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల శ్రీనివాస్, కట్కూరు రాజన్న, తదితరులు పాల్గొన్నారు.